Cricket: చివరి టెస్టులో ఇంగ్లాండు ఆటగాడు కుక్ సెంచరీ

  • ఈ మ్యాచ్ తో టెస్టులకు గుడ్ బై చెప్పనున్న కుక్
  • ఓవల్ లో ఇంగ్లాండ్-ఇండియా మధ్య చివరి టెస్టు మ్యాచ్
  • క్రీజ్ లో కొనసాగుతున్న కుక్ , జో రూట్ 
ఇంగ్లాండు ఓపెనర్ అలిస్టర్ కుక్ తన ఆఖరి టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఓవల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో కుక్ సెంచరీ చేయగానే గ్యాలరీలోని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల చప్పట్లు మిన్నంటాయి. తన చివరి మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసిన  కుక్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఓవల్ లో సెంచరీతో కుక్ తన టెస్టు కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

కాగా, లంచ్ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 243 పరుగులు చేసింది. దీంతో, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు అధిక్యం 283కు చేరుకుంది. క్రీజ్ లో కుక్ 103 పరుగులతో, జో రూట్ 92 పరుగులతో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై  చెప్పనున్నట్టు ఇంగ్లాండు జట్టు మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఇటీవల ప్రకటించాడు. భారత్ తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ అనంతరం తాను తప్పుకుంటానని పేర్కొన్న విషయం విదితమే.
Cricket
oval stadium
england vs india

More Telugu News