petrol: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం!

  • పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ నిర్ణయం
  • ఖజానాపై భారీగా పడనున్న భారం
  • కేంద్రం కూడా పన్నులు తగ్గించాలని  విజ్ఞప్తి
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయి అల్లాడుతున్న సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెట్రోల్, డీజిల్ పై రూ.2 మేర వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. పెట్రోల్ బాదుడుకు నిరసనగా ఈ రోజు ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు.
petrol
diesal
VAT
Prices
Chandrababu
RS.2
bharat bandh

More Telugu News