South Sudan: పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న విమానం.. కుప్పకూలి 21 మంది మృతి!

  • 19 మందికే అనుమతి ఉండగా అంతకుమించి ఎక్కించుకున్న వైనం
  • సరస్సులో కుప్పకూలిన కమర్షియల్ విమానం
  • ప్రాణాలతో బయటపడిన ముగ్గురిలో ఆరేళ్ల బాలిక
దక్షిణ సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉండగా, పరిమితికి మించి 23 మందిని ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
South Sudan
Flight
Crash
Lake

More Telugu News