మందేసి బొజ్జలు పెంచుతున్న నావికా దళ జవాన్లు... కీలక ఆదేశాలు జారీ!
- ఉద్యోగులకు తక్కువ ధరకే మద్యం
- పెరిగిన ఊబకాయం సమస్యలు
- ఇకపై చౌక మద్యం ఇచ్చేది లేదన్న అధికారులు
నావికా దళంలోని అన్ని స్థాయుల్లోని ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుందని నార్త్ వెస్ట్ రీజియన్ కమాండర్ రాకేష్ పాల్ వెల్లడించారు. బరువు తగ్గాలని మెడికల్ బోర్డు సూచించిన ప్రతి ఒక్కరికీ ఇకపై తక్కువ ధరకు మద్యం లభించదని ఆయన అన్నారు. వారు తిరిగి, తమ బరువును అదుపులోకి తెచ్చుకున్న తరువాత చౌక మద్యం సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.