Bhatkal Brothers: భత్కల్ బ్రదర్స్ ను పట్టిస్తే రూ. 20 లక్షలు!

  • గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సూత్రధారులు 
  • సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యం
  • వెల్లడించిన ఎన్ఐఏ
హైదరాబాద్ లో సుమారు 40 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుని పదుల సంఖ్యలో అమాయకులను శాశ్వత వికలాంగులుగా మార్చిన గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల మాస్టర్ మైండ్స్, కరుడుగట్టిన ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ లను పట్టిస్తే, రూ. 20 లక్షల నజరానా ఇస్తామని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) వెల్లడించింది.

వీరి గురించిన సమాచారం తెలిసినవారు [email protected] కు ఈ- మెయిల్‌ ద్వారాగానీ, 011-24368800కు ఫోన్‌ చేసిగానీ చెప్పవచ్చని, సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎన్ఐఏ పేర్కొంది. ఇండియాకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఈ ఉగ్రవాద సోదరులు, 2005 నుంచి ఇండియన్ ముజాహిద్దీన్ పేరిట విధ్వంసక కార్యకలాపాలు సాగిస్తున్నా, 2008లో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ తరువాతే వీరి ఉనికి వెలుగులోకి వచ్చింది. వీరి మరో సోదరుడు యాసిన్ భత్కల్ ప్రస్తుతం హైదరాబాద్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Bhatkal Brothers
Terrorists
IM
NIA

More Telugu News