Yanamala: కేంద్ర ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతోంది: ఏపీ మంత్రి యనమల ఫైర్

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీని వ్యతిరేకించే పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని, రేపు మాపో నోటీసులు రానున్నట్టు బీజేపీ నేతలే చెబుతున్నారని, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ద్వారా బీజేపీ తప్పుడు సమాచారం తెప్పించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు జగన్, మరోవైపు పవన్ తో కలిసి బీజేపీ రాజకీయ క్రీడ ప్రారంభించిందని, అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్నవారిని కాలరాయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకనే కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై పోరాటం ప్రారంభించామని, కేంద్రంలోని బీజేపీ నేతల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు.
Go Back to Shorts
Yanamala
modi

More Telugu News