Chandrababu: ఏపీకి ఏమీ చేయని చంద్రబాబు తెలంగాణకేం చేస్తారు?: అసదుద్దీన్

  • కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఎలా పెట్టుకుంటుంది?  
  • మైనార్టీలు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే పూర్తి మెజారిటీ అన్న అసదుద్దీన్ 
ఏపీ సీఎంగా గత నాలుగేళ్లుగా చంద్రబాబు అక్కడి ప్రజలకు ఏమీ చేయలేదని, అలాంటిది తెలంగాణకు ఏం చేస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అంశంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పుట్టుకొచ్చిన టీడీపీ, ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటోందని, దీనిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.

కేసీఆర్ కు ప్రజాదరణ ఎక్కువనీ, ప్రజలు మళ్లీ పట్టంకడతారన్న నమ్మకం టీఆర్ ఎస్ కు ఉండబట్టే, పదవీకాలం ఇంకా ఉన్నా ముందుగానే ఎన్నికలకు సిద్ధమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అసదుద్దీన్ తెలిపారు. మైనార్టీలు, బలహీన వర్గాలకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. 
Chandrababu
Telugudesam
TRS
Asaduddin Owaisi
MIM
Telangana

More Telugu News