KTR: బరాక్ ఒబామా కూడా ఇంట్లో అంట్లు తోమేవారు!: ఉత్తమ్ కి మంత్రి కేటీఆర్ కౌంటర్

  • బరాక్ ఒబామా కూడా  ఇంట్లో అంట్లు తోమేవారు 
  • డిగ్నిటీ ఆఫ్‌ లేబర్ అంటే ఏంటో ఉత్తమ్ లాంటి వారికి తెలియదు 
  • ఓ ఆంగ్ల వార్త లింక్ ని జతచేసిన కేటీఆర్  
అమెరికాలో అంట్లు తోముకునేవాడన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మరోసారి తన ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో తాను అంట్లు తోముకుంటే తప్పేంటని ప్రశ్నించిన కేటీఆర్.. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇంట్లో అంట్లు తోమేవారని తెలియజేస్తూ తాజాగా మరో ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఓ ఆంగ్ల వార్త లింక్ ని తన ట్వీట్ కి జత చేసి 'డిగ్నిటీ ఆఫ్‌ లేబర్ అంటే ఏంటో మీ లాంటి ఫ్యూడలిస్టులకు తెలియదని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
KTR
Uttam Kumar Reddy
Congress
TRS
Hyderabad
Telangana
USA

More Telugu News