kcr: ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆరే.. భవిష్యత్తులో ప్రధాని కూడా అవుతారు: భీమవరం జ్యోతిష్కుడు

  • కేసీఆర్ కు రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి
  • విక్రమార్క చక్రవర్తి జాతకం ఇది
  • హెలికాప్టర్ ప్రయాణాలలో కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలి
అసెంబ్లీ రద్దు కావడంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆరే అని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణారావు జోస్యం చెప్పారు. కేసీఆర్ జాతకం ప్రకారం రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో కేసీఆర్ పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పారు.

కేసీఆర్ ది విక్రమార్క చక్రవర్తి జాతకమని... ఇలాంటి జాతకం వంద కోట్ల మందిలో ఒక్కరికే ఉంటుందని తెలిపారు. దైవ ప్రక్రియలు కొన్ని సహకరిస్తే భవిష్యత్తులో కేసీఆర్ ప్రధాని కూడా అవుతారని చెప్పారు. 2009లో తెలంగాణ భవన్ లో అపూర్వ చండీయాగాన్ని తాను నిర్వహించడం వల్లే కేసీఆర్ కు రాజయోగం పట్టుకుందని చెప్పారు. అయితే కేసీఆర్ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, హెలికాప్టర్ ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
kcr
jatakam
mandru narayana ramanarao
cm
pm

More Telugu News