హార్దిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు
- ఆరోగ్యం క్షీణించడంతో పాస్ నేతల నిర్ణయం
- దీక్షను పట్టించుకోని గుజరాత్ ప్రభుత్వం
- కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఉద్యమమని ఆరోపణ
తన డిమాండ్లపై 24 గంటల్లోగా స్పందించకుంటే మంచినీరు కూడా ముట్టనని హార్దిక్ హెచ్చరించినా గుజారాత్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఇది కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న ఉద్యమమని ఆరోపించింది. కాగా, గుజరాత్ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి లేదని పాస్ కన్వీనర్ మనోజ్ పనారా ఆరోపించారు.