KATTI mahesh: కత్తి మహేశ్ కు షాక్.. హైదరాబాద్ లో క్రిమినల్ కేసు నమోదు!

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • హిందూ దేవుళ్లపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు
  • న్యాయ సలహా తీసుకున్న పోలీసులు
ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదయింది. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్ మాట్లాడినట్లు హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన గడ్డం శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జూన్ 29న ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాను విజయవాడకు షిఫ్ట్ అయిపోతున్నట్లు మహేశ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
KATTI mahesh
Hyderabad
criminal case
Police

More Telugu News