Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులూ.. సత్తా చాటండి!: ‘జనసేన’ పిలుపు

  • జనసేన సభ్యత్వాలు చేయించుకోవాలి
  • ఈ నెల 9 లోపు ఒక్కొక్కరూ వంద సభ్యత్వాలు చేయాలి
  • థియేటర్లని అలంకరించే బదులు జెండా దిమ్మలు ఏర్పాటు చేయండి
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులకు ‘జనసేన’ ఓ పిలుపు నిచ్చింది.

‘నిజమైన జన సైనికులు.. మీ సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద చేసిన సంబరాలు ఇప్పుడు గ్రామగ్రామానా సభ్యత్వ నమోదుతో చేయండి. థియేటర్లని అలంకరించే బదులు గ్రామాలలో, నగరాలలో జెండా దిమ్మలను ఏర్పాటు చేయండి’ అని పేర్కొంది. రికార్డులు బద్దలు కొట్టాలంటే 09-09-2018 లోపు ఒక్కొక్కరూ వంద సభ్యత్వాల చొప్పున చేర్పించడంతో పాటు పదిమంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని, పవన్ కల్యాణ్ అభిమానుల సత్తా చాటాలని ‘జనసేన’ పిలుపు నిచ్చింది.
Pawan Kalyan
Jana Sena

More Telugu News