Telangana: పొత్తులపై చర్చలకు టీ-పీసీసీ కమిటీ ఏర్పాటు!

  • తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ కసరత్తు
  • కమిటీ సభ్యులుగా ఉత్తమ్, కుంతియా, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క    
  • ఒకట్రెండు రోజుల్లో సమావేశం కానున్న కమిటీ
తెలంగాణ  రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పొత్తులపై చర్చలకు గాను టీ-పీసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం. 
Telangana
Congress

More Telugu News