Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాజీనామా చేయలేదు?: జూపల్లి కృష్ణారావు

  • అసెంబ్లీ రద్దు చేస్తామని తెలియగానే రాజీనామా చేశారు
  • కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం
  • ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీని రద్దు చేస్తామని తెలియగానే రేవంత్ రాజీనామా చేశారని, అసలు చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయమని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  అధికారం, పదవులు, సంపదపై తప్ప మరోదానిపై కాంగ్రెస్ పార్టీకి యావలేదని విమర్శించారు.
Revanth Reddy
jupalli

More Telugu News