allari naresh: చరణ్ మూవీలో అన్నయ్యది నెగెటివ్ రోల్ కాదు: అల్లరి నరేశ్

  • చరణ్ హీరోగా బోయపాటి మూవీ 
  • ఆర్యన్ రాజేశ్ మంచి పాత్ర చేస్తున్నాడు
  • ఆయనకి మంచి పేరు రావడం ఖాయం     
హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి ఎంతో క్రేజ్ వుంది. కొంతకాలంగా తనకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతోన్న సక్సెస్ ను పట్టుకునే పనిలో ఆయన వున్నాడు. అలాంటి నరేశ్ తాజా చిత్రంగా 'సిల్లీ ఫెలోస్' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'మహర్షి' సినిమాలో తన పాత్ర 'గమ్యం' సినిమాలోని 'గాలి శీను' తరహాలో ఉంటుందని చెప్పాడు.

అంతేకాదు చరణ్ మూవీలో తన అన్నయ్య పాత్రను గురించి కూడా ప్రస్తావించాడు. చరణ్ .. బోయపాటి మూవీలో అన్నయ్య ఆర్యన్ రాజేశ్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఈ సినిమాలో ఆయన చాలా మంచి పాత్ర చేస్తున్నాడు .. అది ఆయనకి మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఆర్యన్ రాజేశ్ ఎక్కువగా మాట్లాడడు .. తన పాత్రను గురించి అడిగినా చెప్పడు ..అందుకే నేను చెప్పాను" అంటూ నవ్వేశాడు.   
allari naresh
aryan rajesh

More Telugu News