ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 
Go Back to Shorts
Pakistan
army chief
jawed bajwa

More Telugu News