nayini narsimha reddy: నాయిని నర్సింహారెడ్డి మనస్తాపం.. కేసీఆర్ సమావేశానికి దూరం!

  • తన బంధువుకు ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నాయిని
  • అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపం
  • చివరి క్షణంలో ముషీరాబాద్ అభ్యర్థి పేరును పెండింగ్ లో ఉంచిన కేసీఆర్
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అలకబూనారు. అంతేకాదు కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశానికి కూడా ఆయన దూరమయ్యారు. నాయిని అలకబూనారన్న వార్తతో చివరి క్షణంలో ముషీరాబాద్ అభ్యర్థి ప్రకటనను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఇదే విషయంపై నాయినిని మీడియా ప్రశ్నిస్తే, 'ముషీరాబాద్ టికెట్ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు.. తప్పకుండా ఆయనకే వస్తుందని' ధీమా వ్యక్తం చేశారు. 
nayini narsimha reddy
kcr
musheerabad
candidate

More Telugu News