assembly: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... ఈ రోజు చర్చకు వచ్చే అంశాలు ఇవే!

  • ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ కోడెల
  • శాసనసభలో డ్వాక్రా రుణమాఫీపై చర్చ
  • శాసనమండలిలో నిరుద్యోగ భృతి, మహిళలపై అఘాయిత్యాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు శాసనసభలో డ్వాక్రా రుణాల మాఫీ, ఎన్టీఆర్ గృహాల నిర్మాణం, కరవు అంశాలపై చర్చ జరగనుంది. శాసన మండలిలో ఉపాధి కల్పన కేంద్రాలు, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ విద్యోన్నతి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.
assembly
Andhra Pradesh

More Telugu News