KCR: ఏం నేను మొగోడిని కాకూడదా?: కేసీఆర్

  • ఎన్టీఆర్, చంద్రబాబే మొగోళ్లా?
  • చెన్నారెడ్డి కంటే నేనే మొగోణ్ని
  • కేసీఆర్ తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు
అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ తన సహజ శైలిలో ప్రతిపక్షాలపై నిప్పులు కురిపించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఏం నేను ఎన్టీఆర్‌ను మించినోడిని కావొద్దా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, చెన్నారెడ్డిలే మొగోళ్లుగా ఉండాలా? అని నిలదీశారు. తాను మొగోడిని కావొద్దా? అని ప్రశ్నించారు. చెన్నారెడ్డి తెలంగాణ తీసుకురాకున్నా తాను తెచ్చానని, దీంతో తానే మొగోడినని తేలిపోయిందన్నారు. కేసీఆర్‌కు ఏదీ అసాధ్యం కాదని, కేసీఆర్ తలచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదని చెప్పుకొచ్చారు.   
KCR
Telangana
Assembly
NTR
Chandrababu
Chennareddy

More Telugu News