kcr: నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ శాసనసభకు నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ లో ఫలితాలు వెలువడతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 100 స్థానాల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధిస్తామని, వీటిలో 82 నియోజకవర్గాల్లో అయితే 60 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఘంటా పథంగా చెప్పారు.

రేపు శుక్రవారం చాలా మంచి రోజని, రేపట్నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నామని కేసీఆర్ చెప్పారు. 50 రోజుల్లో 100 సభలను నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ మంచి కోసమే చేస్తాడని చెప్పారు. కె.కేశవరావు అధ్యక్షతన త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ను గెలిపించుకుని, ప్రజలంతా చల్లగా బతకాలని పిలుపునిచ్చారు. 
Go Back to Shorts
kcr
TRS
elections

More Telugu News