Telangana: ‘తెలంగాణ’లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ సీఎస్ నోటిఫికేషన్ జారీ

  • ఈ మేరకు ఓ ప్రకటన విడుదల
  • గవర్నర్ ని కలిసిన అనంతరం ప్రగతి భవన్ కు కేసీఆర్
  • తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన కేసీఆర్
‘తెలంగాణ’లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు. కేసీఆర్ ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగిస్తూ, జీవో నెంబర్ 134ను జోషి జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన అనంతరం, కేసీఆర్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై, తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. కాసేపట్లో తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఈ సమావేశంలోనే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Telangana
kcr

More Telugu News