rajbhavan: రాజ్ భవన్ బయట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

  • కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయిన ఈశ్వర్
  • సకాలంలో రాజ్ భవన్ సిబ్బంది స్పందించడంతో తప్పిన ప్రమాదం 
  • నిరుద్యోగులకు కేసీఆర్ ఏం చేశారని బాధితుడి ప్రశ్న
హైదరాబాద్ లోని రాజ్ భవన్ బయట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. రాజ్ భవన్ భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన అనంతరం, అతను మీడియాతో మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వచ్చానని, తన పేరు ఈశ్వర్ అని, నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థినని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అమరులైన వారికి, ఉద్యమకారులకు, నిరుద్యోగులకు కేసీఆర్ ఏం చేశారని అతను ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నదే తన డిమాండ్ అని చెప్పిన ఈశ్వర్, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించాడు.
rajbhavan
eeswar
suicide

More Telugu News