kcr: టీఎస్ కేబినెట్ సమావేశం ప్రారంభం.. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం.. ఆ తర్వాత ఏం జరగనుందంటే..!

  • ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు
  • అనంతరం గన్ పార్క్ వద్ద అమవీరులకు నివాళి
  • 2.30 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం
ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రత్యేక బస్సులో కేసీఆర్ తో పాటు మంత్రులంతా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ నరసింహన్ ను కలసి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరతారు. అనంతరం గన్ పార్కుకు వెళ్లి, అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు.

అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లి, మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియాతో కేసీఆర్ మాట్లాడతారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తారు. ఈ సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ గజ్వేల్ కు బయల్దేరుతారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్ సభకు హాజరవుతారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభిస్తారు. 
kcr
cabinet meeting
raj bhavan
pres meet
elections
assembly desolve

More Telugu News