Balakrishna: శాసనసభలో భూమాతో బాలయ్య ముచ్చట్లు!

  • సజావుగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • సమావేశాలను బహిష్కరించిన వైసీపీ 
  • భూమా బ్రహ్మానందరెడ్డి పక్కన కూర్చున్న బాలయ్య
ఈ ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తొలగిస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని వైసీపీ స్పష్టం చేసింది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సభలో తన పక్కనే కూర్చున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో ఆయన ముచ్చటిస్తూ కనిపించారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరపున బ్రహ్మానందరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.
Balakrishna
bhuma brahmananda reddy
assembly

More Telugu News