Telangana: ప్రగతి భవన్ కు చేరుకున్న ఉపముఖ్యమంత్రులు!

  • కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం
  • ప్రగతి భవన్ కు చేరుకున్న కడియం, మహమూద్ అలీ 
  • ఇప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు మంత్రులు  
కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కు ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, చందూలాల్, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు చేరుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ని సీఎం కేసీఆర్ కలిసి, అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి సిఫారసు లేఖను ఆయనకు అందిస్తారని తెలుస్తోంది. ఓ ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్, మంత్రులు వెళతారని సమాచారం.
Telangana
kcr

More Telugu News