Revanth Reddy: పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండలేకనే రాజీనామా చేశాను: రేవంత్ రెడ్డి

  • రాష్ట్రంలో అభివృద్ధిని పక్కనబెట్టేశారు
  • తుగ్లక్ పాలన కన్నా దారుణంగా ఉంది
  • ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు తావులేదు
ఇలాంటి పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం ఇష్టం లేకనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం, ఆయన్ని పలకరించిన మీడియాతో రేవంత్ మాట్లాడూతూ, సీఎం కేసీఆర్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధిని పక్కనబెట్టేశారని, రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, ఇలాంటి పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం కంటే, రాజీనామా చేసి నిరసన తెలపడం ముఖ్యమని భావించానని, అందుకే, ఇలా చేశానని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి గానీ, ప్రజాస్వామ్య విలువలకు గానీ ఎక్కడా తావులేదని, తుగ్లక్ పాలన కన్నా దారుణంగా రాష్ట్రంలో పాలన ఉందని విమర్శించారు. 
Revanth Reddy
kcr

More Telugu News