devineni: రైతుల త్యాగాలను జగన్ హేళన చేస్తున్నారు: మంత్రి దేవినేని

  • అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం తగదు
  • బాధ్యతలు మరిచి లేఖలతో కాలయాపన చేస్తున్నారు
  • అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతల పని
రైతుల త్యాగాలను ‘భ్రమరావతి’ అంటూ హేళన చేస్తున్నారని వైఎస్ జగన్ పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరరావు మండిపడ్డారు. ఈరోజు ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బాధ్యతలు మరిచి లేఖలతో కాలయాపన చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బీజేపీ నేతలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్ డైరెక్షన్ లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుస్తున్నారని, అసెంబ్లీకి పగటివేషాలు వేసుకొని వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019 ఎన్నికలలో మోదీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశ ప్రజల జేబులకు మోదీ చిల్లు పెట్టారని విమర్శించారు.
devineni
ap assembly

More Telugu News