pragathi bhavan: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రగతిభవన్ ఎదుట ఉద్యోగుల ఆందోళన!

  • మా డిమాండ్లు పరిష్కరించాలి
  • ప్రభుత్వం మాతో వెట్టిచాకిరీ చేయిస్తోంది
  • సర్వశిక్షా అభియాన్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది
తెలంగాణలోని సర్వశిక్షా అభియాన్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ఎదుట రహదారిపై బైఠాయించారు. ప్రగతిభవన్ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, వీరి ఆందోళన కారణంగా బేగంపేటలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. కాగా, ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా తమ బతుకులు మారలేదని ఆందోళనకారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
pragathi bhavan
sarva sikhsha abhiyan

More Telugu News