పోలవరంపై ఒడిశా వేసిన పిటిషన్లో పసలేదు.. కొట్టేయండి: సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం
- ఏపీ ఇచ్చే పరిహారాన్ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు
- ముంపు ప్రాంతాల్లో అడ్డుగోడలు నిర్మించడం లేదు
- ట్రైబ్యునల్ తీర్పు ప్రకారమే నిర్మాణ పనులు
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
ప్రాజెక్టు కింద ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు సూచించినా ఇప్పటి వరకు స్పందన లేదని అఫిడవిట్లో ఆరోపించింది. ప్రాజెక్టు షెడ్యూలు మొత్తం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో వందేళ్లకోసారి వచ్చే గరిష్ట వరదను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, 500 ఏళ్లకు ఒకసారి వచ్చేందుకు అవకాశం ఉన్న 36 లక్షల క్యూసెక్కులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అడ్డుకట్టలు నిర్మించుకోవడం కానీ, ఏపీ ఇచ్చే పరిహారాన్ని తీసుకోవడం కానీ చేయలేదని వివరించింది. కాబట్టి ఒడిశా ప్రభుత్వం చేస్తున్నఆరోపణల్లో పస లేదని, వాటిని కొట్టి వేయాలని అఫిడవిట్లో కోరింది.