Telangana: మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కానున్న తెలంగాణ కేబినెట్.. అనంతరం కీలక ప్రకటన!

  • ముందస్తు ఊహాగానాలకు నేడు తెరపడే అవకాశం
  • మధ్యాహ్నం 1:30కి గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
  • 2 గంటలకు మీడియా సమావేశం
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు నేడు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అరగంటపాటు జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

 భేటీ ముగిసిన అనంతరం 1:30 గంటలకు సీఎం కేసీఆర్ రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌తో జరిగే అరగంట భేటీలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ వివరించనున్నారు. అనంతరం రెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను సీఎం వెల్లడించనున్నట్టు సమాచారం. అలాగే, ముందస్తు ఎన్నికలపై ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది.
Telangana
KCR
Governor
Elections
Cabinet meet

More Telugu News