Jagan: జగన్ చేతుల మీదుగా ఓ చిన్నారికి అన్నప్రాశన!

  • 255వ రోజు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్పయాత్ర
  • జగన్ తన పాదయాత్రలో 2900 కి.మీ. పూర్తి
  • వైసీపీ అధినేతతో సెల్ఫీలకు పలువురు ఆసక్తి
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 255వ రోజు పూర్తి చేసుకుంది. ఈరోజు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని బుదిరెడ్డిపాలెం క్రాస్ నుంచి ప్రారంభమై గుల్లేపల్లి, రావలమ్మపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్, సబ్బవరం, చిన్నగొల్లలపాలెం క్రాస్ మీదుగా అమృతపురం వరకు కొనసాగింది.

సబ్బవరం మండలం, పెదనాయుడుపాలెం పాతరోడ్డు వద్ద జగన్ తన పాదయాత్రలో 2900 కి.మీ. పూర్తి చేశారు. ఈ సందర్భంగా జగన్ ని ప్రజలు, అభిమానులు కలిశారు. జగన్ తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు జగన్ చేతుల మీదుగా అన్నప్రాశన చేయించారు.
Jagan
annaprasana

More Telugu News