amaravathi: హైకోర్టు నిర్మాణంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

  • డిసెంబర్ చివరి నాటికి అమరావతి రోడ్లపై వాహనాలు తిరిగేలా చేస్తాం
  • అమరావతి నిర్మాణం జరగకూడదని బీజేపీ, వైసీపీలు యత్నిస్తున్నాయి
  • అమరావతి బాండ్ల వల్ల ప్రజలపై అప్పుల భారం పడదు
ఏపీ రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 31 నాటికి హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి అమరావతి రోడ్లపై వాహనాలు తిరిగేలా చేస్తామని తెలిపారు. ఈ ఉదయం అమరావతిలో రోడ్ల నిర్మాణ పురోగతిని నారాయణ పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం జరగకూడదని బీజేపీ, వైసీపీలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి బాండ్లపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బాండ్ల జారీ వల్ల ప్రజలపై అప్పుల భారం పడదని తెలిపారు. 
amaravathi
bonds
narayana
YSRCP
bjp
high court
Andhra Pradesh

More Telugu News