Chittoor District: కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగిన తల్లి.. తెలియక పొరపాటున తాగేసిన కుమార్తె!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • అనారోగ్యంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం బాధను భరించలేక ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమె కుమార్తె పొరపాటున దాన్ని తాగేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

చిత్తూరు రూరల్ మండలానికి చెందిన మంజుల గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల వద్ద చూపించుకున్నా తగ్గకపోవడంతో ఆమె మంగళవారం కూల్ డ్రింక్ లో పురుగుల మందును కలుపుకుని తాగింది. మిగిలినదాన్ని అక్కడే ఉంచేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మంజుల కుమార్తె నవ్య(7) అది కూల్ డ్రింక్ అనుకుని తాగేసింది. తల్లీకుమార్తెలు అస్వస్థతకు లోనుకావడంతో వెంటనే కుటుంబ సభ్యులు వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Chittoor District
SUICIDE
Andhra Pradesh

More Telugu News