Congress: అలర్ట్ అయిన కాంగ్రెస్... ముఖేష్ గౌడ్ ఇంట్లో నేతల భేటీ, జానారెడ్డి గైర్హాజరు!

  • రాజకీయ పరిణామాలపై చర్చించనున్న నేతలు
  • అసెంబ్లీ రద్దయితే వ్యూహమెలా?
  • ఎన్నికలకు సిద్ధమేనంటున్న కాంగ్రెస్
తెలంగాణలో ముందస్తుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్, రేపు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. నేడు ఆ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ ఇంట్లో పలువురు నేతలు సమావేశమై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు, ఒకవేళ అసెంబ్లీ రద్దయితే, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న అంశాలపైనే ఈ చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఆయన కంటికి ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందువల్లే ఆయన ముఖేష్ గౌడ్ ఇంటికి రాబోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Congress
Elections
Telangana

More Telugu News