Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో విచిత్రం.. 'పీఎన్ఆర్‌'కి ఫుల్‌ఫామ్ చెప్పలేకపోయిన రైల్వే టీటీఈ!

  • టీటీఈగా పనిచేస్తున్న కంటెస్టెంట్
  • బిగ్ బీ అడిగిన ప్రశ్నకు ఆడియన్స్ పోల్ తీసుకున్న ఉద్యోగి
  • షాక్‌కు గురైన ప్రేక్షకులు
హిందీలో వస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో ఆశ్చర్యకర సంఘటన  జరిగింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన సోమేశ్ చౌదరీ హాట్‌సీటు సంపాదించారు. అప్పటికే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.3.20 లక్షలు సంపాదించుకున్న ఆయన  తర్వాతి ప్రశ్నకు లైఫ్‌లైన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంతకీ ఆయను అడిగిన ప్రశ్నేంటో తెలుసా? ‘పీఎన్ఆర్’ ఫుల్‌ఫామ్ ఏంటో చెప్పాలని. ఈ ప్రశ్నకు ఆయన లైఫ్‌లైన్ ఉపయోగించుకోవడంతో హోస్ట్ అమితాబ్ బచ్చన్ సహా అందరూ షాక్‌కు గురయ్యారు. ఎందుకో తెలుసా? ఆయన రైల్వే ఉద్యోగి కావడం, అందులోనూ టికెట్ ఎగ్జామినర్‌గా పనిచేస్తుండడంతో అందరూ అవాక్కయ్యారు. నిత్యం అందులోనే మునిగితేలే వ్యక్తికి ఆ పదానికి అర్థం తెలియకపోవడంపై అందరూ నోరెళ్లబెట్టారు. ఆడియన్స్ పోల్ తీసుకున్న ఆయన, వారిచ్చిన ‘పాసింజర్ నేమ్ రికార్డు (పీఎన్ఆర్)తో సంతృప్తి చెంది అదే సమాధానంగా ఎంచుకుని గండం నుంచి గట్టెక్కారు.
Kaun Banega Crorepati
Somesh Choudhary
PNR
Bihar

More Telugu News