ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడి మృతి... తట్టుకోలేక అక్కడే తల్లి ఉరి!
- తిరుపతి రూయా ఆసుపత్రిలో ఘటన
- నిన్న మరణించిన కుమారుడు
- రాత్రి చెట్టుకు ఉరేసుకుని మరణించిన తల్లి
కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిన ఆ తల్లి, తనకీ బతుకు వద్దంటూ ఎంతో సేపు విలపించింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెను ఓదార్చారు. ఆసుపత్రి సిబ్బంది, ఈ ఉదయం మృతదేహాన్ని ఆమె ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రూయా ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ చెట్టుకు ఆమె ఉరేసుకుని మరణించింది. వీరిద్దరి మృతి వార్త విని బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.