అఖిలేష్ మద్దతు లేకుండా రాహుల్ గెలిచే పరిస్థితి లేదు: కేటీఆర్
- జనాలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదు
- గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేడు
- రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది
కేసీఆర్ ను ఓడించేంత వరకు గడ్డం తీయనని అంటున్నారని... గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 12 మంది ముఖ్యమంత్రుల అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 24 గంటల పాటు రైతులకు కరెంట్ ను అందిస్తున్నామని చెప్పారు. ప్రగతి నివేదన సభపై విపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివని అన్నారు.