Nara Lokesh: ‘తెలంగాణ’లో ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది: నారా లోకేశ్

  • ‘తెలంగాణ’లో నాయకులు టీడీపీని వీడారు
  • కార్యకర్తలు మాత్రం అలానే ఉన్నారు
  • పొత్తులపై పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయిస్తాం
‘తెలంగాణ’లో ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘తెలంగాణ’లో నాయకులు టీడీపీని వీడినా కార్యకర్తలు మాత్రం వీడలేదని, క్యాడర్ చెక్కుచెదరలేదని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి టీడీపీ సిద్ధంగా వుందని, ఒకవేళ పొత్తుల విషయం తలెత్తితే పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.

కుంభకోణాలు చేసే వారికి ఏ అభివృద్ధి అయినా కుంభకోణంలానే కనిపిస్తుందని, ఆరోపణలు చేయడం చాలా సులభమని, ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణల వల్ల ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారు భయపడే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. అసత్య ఆరోపణలు చేసే ప్రతిపక్షాలను సాక్ష్యాలు ఉంటే చూపమని నాలుగు నెలల నుంచి అడుగుతూనే ఉన్నానని, ఎన్నిసార్లు అడిగినా ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు. అసత్య ఆరోపణలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని విపక్షాలకు లోకేశ్ సూచించారు.
Nara Lokesh
Telangana

More Telugu News