Visakhapatnam District: విశాఖలో అక్టోబర్ 22 నుంచి 26 వరకు ‘ఫింటెక్ ఫెస్టివల్’

  • పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఒకే వేదికపైకి  
  • అతిపెద్ద వ్యాపార సదస్సు ‘ఫింటెక్ ఫెస్టివల్’
  • ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి
విశాఖపట్టణం వేదికగా అక్టోబర్ 22 నుంచి 26 వరకు ‘ఫింటెక్ ఫెస్టివల్’ నిర్వహించనున్నట్టు ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలియజేశారు. పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా నిర్వహిస్తున్న అతిపెద్ద వ్యాపార సదస్సు ‘ఫింటెక్ ఫెస్టివల్’ అని, ప్రపంచ మేధాశక్తిని విశాఖకు తీసుకొచ్చే విధంగా ఈ సదస్సు ఉంటుందని అన్నారు. కాగా, ఐటీ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, వివిధ రంగాలకు చెందిన 75 మంది నిష్ణాతులు ఫింటెక్ ఫెస్టివల్ కు హాజరుకానున్నారని, వివిధ దేశాలకు చెందిన దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు విచ్చేస్తారని అన్నారు.
Visakhapatnam District
AP IT

More Telugu News