puri: విజయ్ దేవరకొండపై దృష్టి పెట్టిన పూరి జగన్నాథ్

  • విజయ్ దేవరకొండ చేతిలో ఐదు సినిమాలు 
  • త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలు 
  • ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతల వెయిటింగ్
ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ అంతా కూడా విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటోంది. విజయ్ కి గల క్రేజ్ కారణంగా ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ చేతిలో 5 సినిమాలు వున్నాయి. వాటిలో రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. రెండు సినిమాలు స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేసుకునే పనిలో వున్నాయి.

ఈ ప్రాజెక్టులను ఆయన పూర్తిచేయడానికి చాలా సమయమే పట్టనుంది. అయితే ఈ మధ్యలోనే ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో పూరి జగన్నాథ్ వున్నట్టుగా సమాచారం. రామ్ గోపాల్ వర్మకి .. విజయ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వర్మ వైపు నుంచి విజయ్ ని ఒప్పించే పనిలో పూరి వున్నాడని అంటున్నారు. ఆల్రెడీ ఆయన కథను కూడా రెడీ చేసేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
puri
vijay devarakonda

More Telugu News