kcr: జోరు పెంచిన కేసీఆర్.. ఫామ్ హౌస్ లో వ్యూహ రచనలో బిజీ!

  • నిన్న సాయంత్రం ఫామ్ హౌస్ కు చేరుకున్న కేసీఆర్
  • అసెంబ్లీ రద్దుపై సీనియర్ నేతలతో చర్చలు
  • 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం
ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తన ఫామ్ హౌస్ లో ముందస్తు వ్యూహ రచనలో ఆయన బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.

 ఇప్పటికే ముందస్తుకు సంబంధించి ఒక్కొక్క లాంఛనాన్ని పూర్తి చేస్తూ వచ్చిన కేసీఆర్... కేబినెట్ సమావేశం, అసెంబ్లీ రద్దుపై పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులకు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. 
kcr
farm house
elections

More Telugu News