rana: 'పటాస్' మూవీ రానా చేయవలసిందట!

  • 'పటాస్' కథను ముందుగా నేను విన్నాను 
  • కథలో మార్పులు చేర్పులు చేశాము 
  • 'బాహుబలి' కారణంగా చేయలేకపోయాను
ఒక హీరో చేయవలసిన సినిమా .. కొన్ని కారణాల వలన మరో హీరోకి వెళుతుండటం చిత్రపరిశ్రమలో చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా వెళ్లిన సినిమా సూపర్ హిట్ అయినప్పుడు, ముందుగా ఆ సినిమా చేయాలనుకున్న హీరో 'అయ్యో' అనుకోవడం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ తనకి 'పటాస్' సినిమా విషయంలో కలిగిందని రానా చెప్పాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా 'పటాస్' సినిమా తెరకెక్కింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. కల్యాణ్  రామ్ కెరియర్లోనే చెప్పుకోదగిన హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను గురించి రానా ప్రస్తావిస్తూ .. "అనిల్ రావిపూడి ఈ కథను ముందుగా నాకు వినిపించాడు. ఇద్దరం కలిసి కొన్ని మార్పులు చేర్పులు చేశాము. అదే సమయంలో 'బాహుబలి' షెడ్యూల్స్ లో మార్పులు జరిగి, మరికొన్ని రోజులు కేటాయించవలసి వచ్చింది. అందువలన ఈ సినిమా నేను చేయలేకపోయాను" అని రానా చెప్పాడు.  
rana
anil ravipudi

More Telugu News