India: మీడియాలోని వార్తలు ఆవు పేడతో సమానం: రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం

  • నిమ్రత్ కౌర్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన రవిశాస్త్రి
  • కేవలం ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నాం
  • ప్రేమ కోసం వెంపర్లాడటం లేదన్న టీమిండియా కోచ్
  బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తో తాను డేటింగ్ చేస్తున్నట్టు గడచిన వారం రోజులుగా వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఆవు పేడతో సమానమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం ఓ జర్మనీ కంపెనీ తనను, నిమ్రత్ ను వారి కార్ల ప్రచారం నిమిత్తం ఎంచుకుందని, ఆ సమయంలోనే తామిద్దరికీ పరిచయం ఏర్పడిందని చెప్పిన రవిశాస్త్రి, తాము కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నామని అంతకు మించి మరేమీ లేదని ఆయన చెప్పారు. తానేమీ ప్రేమ కోసం వెంపర్లాడటం లేదని వ్యాఖ్యానించిన రవిశాస్త్రి, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుతో కలసి ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
India
Cricket
Ravishastri
Namrat Kaur

More Telugu News