manchu manoj: నీపై వచ్చిన నిందలను తప్పు అని నిరూపించుకో 'మా'!: మంచు మనోజ్

  • 'మా' అసోసియేషన్ నిజాయతీగా వ్యవహరిస్తోంది
  • ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు
  • 'మా' సభ్యులు చికెన్స్ కాదు పారిపోవడానికి
ఇటీవలి కాలంలో హీరో మంచు మనోజ్ కు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కారణాలేమైనా కావచ్చుగాక... అతన్ని అభిమానిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా మనోజ్ చాలా యాక్టివ్ అయ్యాడు. 'మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నిన్ను చూడాలని ఉంది బ్రదర్' అంటూ మనోజ్ ను ఓ అభిమాని అడిగాడు. దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు మనోజ్.

'నేను 'మా'లోకి వెళ్తే అందరికీ ఫసక్కే. అసోసియేషన్ చాలా నిజాయతీగా వ్యవహరిస్తోంది. తమపై వస్తున్న విమర్శలను తప్పు అని నిరూపించడం కోసమైనా 'మా' సభ్యులు సంఘాన్ని రివిజన్ చేస్తారు. వాళ్లేమీ చికెన్స్ కాదు... పారిపోవడానికి. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవడానికి 'మా' ఆఫీస్ తాళాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీపై వచ్చిన నిందలను తప్పు అని నిరూపించుకో'మా'' అంటూ మనోజ్ స్పందించాడు.
manchu manoj
maa
association

More Telugu News