Fish: చేపలు తాజాగా ఉండాలని నకిలీ కళ్లు తగిలించిన యజమాని.. షాపును మూసివేయించిన ప్రభుత్వం

  • కువైట్‌లో ఘటన
  • చేపలకు నకిలీ కళ్లు అతికించిన యజమాని
  • సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
చేపలు తాజాగా ఉన్నట్టు కనిపించేందుకు వాటికి నకిలీ కళ్లు అంటించిన ఓ దుకాణ యజమాని అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. కువైట్‌లో జరిగిందీ ఘటన. చేపలకు నకిలీ కళ్ల వార్త సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో స్పందించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ షాపును మూసివేయించింది.

చేపలు బాగా మాగిపోయి ఉండడంతో వాటిని ఎలాగైనా విక్రయించాలని భావించిన దుకాణ యజమాని తాజాగా ఉండేలా వాటికి నకిలీ కళ్లు అతికించి వినియోగదారులను ఆకర్షించాడు. వాటిని తాజా చేపలని భ్రమించి కొనుగోలు చేసిన వినియోగదారుల్లో ఒకరు మోసాన్ని గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదికాస్తా క్షణాల్లో వైరల్ అయింది. ట్విట్టర్‌లో కామెంట్లు హోరెత్తాయి. వీడియో కాస్తా ప్రభుత్వానికి చేరడంతో స్పందించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ షాపును గుర్తించి మూసివేయించింది. దాని లైసెన్స్‌ను రద్దు చేసింది.
Fish
Kuwait
Social Media
Fish Shop
sneaky trick

More Telugu News