tamilisai soundararajan: తమిళనాడు బీజేపీ చీఫ్‌కు విమానాశ్రయంలో చేదు అనుభవం.. బీజేపీకి వ్యతిరేకంగా మహిళ నినాదాలు!

  • ట్యూటికోరిన్ విమానాశ్రయంలో ఘటన
  • సౌందరరాజన్‌ను చూసిన వెంటనే నినాదాలు
  • అరెస్ట్ చేసిన పోలీసులు?
తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు ట్యూటికోరిన్ (తూత్తుకుడి) విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమెను చూసిన ఓ మహిళ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సౌందరరాజన్ ఆమెతో గొడవకు దిగారు. అది కాస్తా పెద్దది కావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పి పంపించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆమె వెనక ఎవరో ఉండి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయించారని ఆరోపించారు. మధ్యవయస్కురాలైన ఆమె బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ తనను అనుసరించిందని, ఆమె వెనక ఎవరో ఉండి ఇలా చేయించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
tamilisai soundararajan
BJP
Tuticorin
Airport
Police

More Telugu News