vijay devarakonda: అదృష్టం కాదు .. పడిన కష్టానికి ఫలితం దక్కింది: విజయ్ దేవరకొండ

  • 'పెళ్లి చూపులు' హిట్ అయింది 
  • ఆ విజయం సమష్టి కృషి 
  • కష్టాన్నే తప్ప అదృష్టాన్ని నమ్మను
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేశాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీత గోవిందం' చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత రానున్న 'టాక్సీవాలా' కూడా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై చేసిందే. దాంతో ఒకేసారి గీతా ఆర్ట్స్ 2లో రెండు సినిమాలు చేయడం విజయ్ దేవరకొండ అదృష్టం అనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై స్పందించిన విజయ్ దేవరకొండ తాను అదృష్టాన్ని ఎంతమాత్రం నమ్మనని చెప్పాడు. 'పెళ్లి చూపులు' హిట్ కావడం వల్లనే తనకి గీతా ఆర్ట్స్ 2 వారు ఛాన్స్ ఇచ్చారని అన్నాడు. 'పెళ్లి చూపులు' కూడా నా ఒక్కడి వల్లనే హిట్ కాలేదు .. అందరి కృషిలో నేను ఒకడిని అయ్యానని చెప్పాడు. ఇక్కడ అదృష్టం వెంటపడటం .. దాని కారణంగా అవకాశాలు వచ్చిపడటం జరగదని అన్నాడు. కష్టపడినప్పుడు అందుకు తగిన ఫలితం లభిస్తుందనీ, అలాంటి ఫలితంగానే తనకి 'గీతా ఆర్ట్స్ 2'లో అవకాశం.. 'గీత గోవిందం' సక్సెస్ లభించాయని చెప్పుకొచ్చాడు.        
vijay devarakonda

More Telugu News