Jagan: ప్రజా సంకల్పయాత్ర.. ఉట్టి వేడుకల్లో పాల్గొని చిరునవ్వు చిందించిన జగన్!

  • వైజాగ్ లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత
  • ఉట్టి కొట్టిన చిన్నారులు
  • జగన్ వేడుకల్లో పాల్గొనడంపై గ్రామస్తుల హర్షం
ప్రజా సంకల్పయాత్ర 253వ రోజు సందర్భంగా వైఎస్ జగన్ ఈ రోజు వైజాగ్ లోని మాడుగుల నియోజకవర్గం కొత్తపెంట గ్రామానికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణుడి వేషంలో పలువురు చిన్నారులు అలరించారు. ఈ ఉట్టి ఉత్సవంలో జగన్ పాల్గొన్నారు.

చిన్నారులు ఉట్టి కొడుతుండగా, జగన్ చిరునవ్వులు చిందించారు. నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా, జగన్ తమ ఊరిలో ఉట్టి ఉత్సవంలో పాల్గొనడంపై కొత్తపెంట వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Jagan
YSRCP
praja samkalpya yatra
Visakhapatnam District

More Telugu News