family: ‘12 వేళ్లున్న పిల్లాడిని బలి ఇస్తే డబ్బే డబ్బు’ అన్న తాంత్రికుడు.. బాబును చంపేందుకు వెంటపడుతున్న బంధువులు!

  • ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘటన
  • బలి ఇవ్వాలని సలహా ఇచ్చిన తాంత్రికుడు
  • వణికిపోతున్న తల్లిదండ్రులు
మూఢనమ్మకాలు కొన్నికొన్ని సార్లు ప్రాణాంతకం అవుతాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాళ్లు, చేతులకు చెరో 12 వేళ్లతో జన్మించిన పిల్లాడిని బలి ఇస్తే.. భారీగా సంపద లభిస్తుందని ఓ తాంత్రికుడు చెప్పడంతో అతడిని చంపేందుకు సొంత బంధువులే ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు 24 గంటలు కంటికి రెప్పలా అతడిని కాపాడుకుంటున్నారు.

యూపీలోని బారాబంకి ప్రాంతానికి చెందిన దంపతులు ఇప్పుడు గజగజా వణికిపోతున్నారు. తమ పిల్లాడిని బలి ఇస్తే సంపద సిద్ధిస్తుందని ఓ తాంత్రికుడు చెప్పడంతో బంధువులంతా పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు తిరుగుతున్నారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ కుమారుడిని స్కూలుకు కూడా పంపడం లేదని వాపోయాడు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

ఈ విషయమై బారాబంకి సర్కిల్ ఆఫీసర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని చెప్పారు. తాను పిల్లాడి చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని ఆయన తెలిపారు. బాధిత కుటుంబం పేదదనీ, తానిక్కడ ఉన్నంతవరకూ పిల్లాడిని ఆదుకుంటానని చెప్పారు. 
family
sacrifice
Uttar Pradesh
Police
barabanki

More Telugu News