నేను మాటలు చెప్పను.. ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తా!: సీఎం కేసీఆర్

  • మా ప్రభుత్వం ఉన్నంత వరకూ రైతు బంధు పథకం కొనసాగుతుంది
  • మా రైతాంగం ధనవంతులయ్యే వరకూ కొనసాగిస్తాం
  • మేనిఫెస్టోలో చెప్పని అంశాలనూ అమలు చేస్తున్నాం 
కేసీఆర్ మాటలు చెప్పడని, తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తానని, ఆకుపచ్చ తెలంగాణ సాధించి తీరతామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకూ రైతు బంధు పథకం కొనసాగుతుందని, తెలంగాణ రైతాంగం ధనవంతులు అయ్యే వరకూ ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగిస్తామని చెప్పారు.

మేనిఫెస్టోలో చెప్పని 76 అంశాలను అమలు చేస్తున్నామని, తెలంగాణకు బాధలు శాశ్వతంగా పోయేలా అద్భుత ప్రణాళికలు చేశామని, చిమ్మ చీకట్ల నుంచి 24 గంటల విద్యుత్ ఇచ్చే స్థాయికి చేరామని, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
Go Back to Shorts
kcr

More Telugu News